ఫ్లాప్ ఇచ్చిన హీరోపై కూడా 100 కోట్లు పెట్టేస్తున్నారు: తమ్మారెడ్డి భరద్వాజ 

  • నిర్మాతగా 50 ఏళ్ల కెరియర్ పూర్తి చేసిన తమ్మారెడ్డి  
  • తాజా చిత్రంగా రూపొందిన 'వదలా'
  • టెక్నాలజీ పెరిగినా సమస్యలు లేకపోలేదని వెల్లడి 
  • హీరోల పారితోషికం విషయంలో నిర్మాతలు మారాలని వ్యాఖ్య 
      

 టాలీవుడ్ దర్శక నిర్మాతగా తమ్మారెడ్డి భరద్వాజకి మంచి పేరు ఉంది. ఆయన కెరియర్ మొదలై 50 ఏళ్లు అవుతోంది. అయితే 15 ఏళ్లుగా నిర్మాతగా ఆయన నుంచి సినిమా రాలేదు. అలాంటి ఆయన నుంచి 'వదలా' అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. జగపతిబాబు - లయ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, ఆకెళ్ల వి.కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ తో తమ్మారెడ్డి భరద్వాజ బిజీగా ఉన్నారు.   

"ఒకప్పటికంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. కాకపోతే అప్పటికంటే ఇప్పుడు కాస్త కాంప్లికేట్ అయింది. క్వాలిటీ పరంగా చూసుకున్నప్పటికీ, ఆ రోజులలో వచ్చిన సినిమాలు ఏ మాత్రం తగ్గకపోవడం కనిపిస్తుంది. అప్పటికి ఆ సినిమాలు .. ఇప్పటికి ఈ సినిమాలు అనుకోవాలంతే. ఒకప్పుడు హీరోలు ఎక్కువ సినిమాలు చేసేవారు. ప్రేక్షకులు థియేటర్స్ కి ఎక్కువగా వచ్చేవారు. అయితే ఇప్పుటి హీరోలు సినిమాల సంఖ్య తగ్గించుకోవడానికి, ఆడియన్స్ థియేటర్స్ వరకూ రాలేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి" అని అన్నారు. 

"ఎప్పుడూ కూడా 95 శాతం సినిమాలకి డబ్బులు పోతాయి. 5 శాతం మాత్రమే సినిమాలకు డబ్బులు వస్తాయి. అందువలన నిర్మాతలు భయపడుతూనే సినిమాలు తీస్తూ ఉంటారు. సినిమా ఏదైనా ప్రొడ్యూసర్ .. డిస్ట్రీబ్యూటర్ .. ఎగ్జిబిటర్ అందరూ ఫేస్ చేయవలసిందే. పారితోషికం విషయానికి వస్తే, నిర్మాతలు ఇస్తున్నప్పుడు హీరోలు తీసుకుంటారు. ఫ్లాప్ ఇచ్చిన హీరోకి పారితోషికం పెంచి తీసుకునే నిర్మాతలు ఉన్నారు ఇప్పుడు. తీసుకోవడాన్ని హీరోలు తగ్గించాలని అనడం కంటే, ఇవ్వడాన్ని నిర్మాతలు తగ్గిస్తే సరిపోతుంది" అని చెప్పారు.


Tammareddy Bharadwaja
Vadala Movie
Jagapathi Babu
Laya
Telugu Cinema
Tollywood
Film Production
Movie Industry
Telugu Movies
Aakella V Krishna

More Telugu News